పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో సొంత బాబాయిని హత్య చేసి ఆ నేరాన్ని టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు మళ్ళీ వాహనాలను తగలబెట్టి టీడీపీపై నిందలు వేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ముందురోజే వాహనాల దహనం జరగడం, తెల్లవారుజామునే దాడులు జరిగాయంటూ ప్రచారం చేయడం వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ జగన్ డైరెక్షన్‌లోనే చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించి, తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
పులివెందులలో రాజకీయ లబ్ది కోసమే వైసీపీ గొడవలు చేస్తోంది – బీటెక్ రవి
0
10
Latest Articles
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు సర్కార్ – వైఎస్ జగన్
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా ఖూనీ చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ...
- Advertisement -
- Advertisement -


