మత్స్యకారుల వేటకు ‘కరెంట్’ రెక్కలు

మత్స్యకారుల వేటకు ‘కరెంట్’ రెక్కలు
కాకినాడలో ఎలక్ట్రిక్ బోట్ల ట్రయల్ రన్ విజయవంతం!
ఇంధన భారం తగ్గించడమే లక్ష్యం :
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాయితీ కల్పిస్తామని హామీ
ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
కాకినాడ జిల్లా :
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న మత్స్యకారులకు సాంకేతికత కొత్త ఊరటనిస్తోంది. రోడ్లపై దూసుకుపోతున్న ఈవీ విప్లవం ఇప్పుడు సముద్ర అలలపైనా సాకారం కానుంది. కాలుష్య రహిత ప్రయాణం, వ్యయ నియంత్రణే ధ్యేయంగా కాకినాడ తీరంలో విద్యుత్ ఆధారిత బోట్ల (EV Boats) ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) శనివారం విజయవంతంగా జరిగింది. శ్రీ సూరా వెంచర్స్’ సంస్థ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బోటును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నీటిపై బోటు సాఫీగా సాగిన తీరును పరిశీలించిన ఆయన నిర్వాహకులను అభినందించారు​.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్ ఖర్చు మోయలేని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కొంత ఊరటనిస్తున్నప్పటికీ, అధిక ఇంధన వ్యయం వల్ల గిట్టుబాటు కావడం లేదన్నారు. విదేశాల్లో విజయవంతమైన ఈ ఎలక్ట్రిక్ బోట్ల విధానం మన తీరంలో అందుబాటులోకి వస్తే మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ​15 టన్నుల సామర్థ్యంతో భారీ బోట్లు సిద్ధం చేయాలని,  వేట సమయంలో బోట్లలో కనీసం 15 టన్నుల వరకు ఐస్, మంచినీరు, వేట సామగ్రిని నిల్వ చేసుకోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా భారీ సామర్థ్యం కలిగిన బోట్లను డిజైన్ చేయాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను, సాధ్యాసాధ్యాలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, రాయితీ పథకాల ద్వారా వీటిని మత్స్యకారులకు చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.​ ఈ కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు, స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్