జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన ఆనంద్, సంజయ్ అనే ఇద్దరు యువకులు మేస్త్రీ పనుల నిమిత్తం గత వారమే చింతకుంట గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో శివారులోని బావి పక్కనే ఉన్న కల్వర్టుపై కూర్చుని ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఇద్దరూ పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. చీకటిగా ఉండటంతో బయటకు రాలేక నీట మునిగి మృతి చెందారు.
——-
ఉదయం వరకు వారు గదికి రాకపోవడంతో, తోటి పనివారికీ అనుమానం వచ్చి వారి కోసం వెతకడం ప్రారంభించారు. చింతకుంట శివారులోని బావి వద్దకు వెళ్లి పరిశీలించగా, అక్కడ వారి చెప్పులు, ఇతర ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో చూడగా ఇద్దరూ మృతి చెంది తేలియడం గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి విధి విచిత్రంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Latest Articles
- Advertisement -


