ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి పాల్పడ్డారు. అమెరికాలోని ఓహాయోలో ఈ ఘటన జరిగింది. అమెరికాలో జరిగి ఈ ఘటనపై భారతీయులు, అక్కడ సెటిల్ అయిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అమెరికాలోని ఒహాయోలోని గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలోని రిచ్‌మండ్ హైట్స్‌లోని స్వామినారాయణ వడ్తల్ ధామ్ హిందూ మందిరంలో.. భక్తులు భారీగా చేరుకున్నారు. శుక్రవారం భక్తిలో మునిగిపోయి.. దేవుడి పూజలో నిమగ్నమయ్యారు. సరిగ్గా ఒంటిగంటన్నర ప్రాంతంలో ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇటుకలను విసిరి తమ అరచకాన్ని ప్రదర్శించారు. దుండగులు దాడి చేసిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై అక్కడి అధికారులు అలెర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక సాక్షుల ఆధారాంగా ఎంక్వైరీని మొదలు పెట్టారు. దుండగులు చేసిన దాడిలో భవనానికి నష్టం వాటిళ్లింది.
ఈ ఘటన జరిగిన సమయంలో భక్తులు కూడా ఉండటంతో ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దీంతో FBI, సివిల్ రైట్స్ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. అక్కడి ఆలయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని విధాలా సహాయం అందిస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. హిందూ అమెరికన్ సమాజంపై ద్వేషం, కఠోర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ద్వేషపూరిత నేరం జరిగి ఉండొవచ్చనే అనుమానాలు కలుగజేస్తున్నాయి. నేరస్థులను పట్టుకోవడాన్ని చట్ట అమలు సంస్థలు అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నాయి. అలాగే, భారతీయ, హిందూ అమెరికన్ సమాజాలపై ద్వేషపూరిత ప్రసంగాలను అమెరికాలోని నాయకులు, ప్రభుత్వ సంస్థలు ఖండించాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దాడపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది సరికాదంటూ తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు.
ఈ ఘటనపై అమెరికాకు చెందిన.. హిందూ హక్కుల పరిరక్షణ సంస్థ కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్తన్ అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీ సామినారాయణ హిందూ టెంపుల్ వడ్తాల్‌ధామ్‌లో పూజారులు, కొంతమంది భక్తులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనను రిచ్‌మండ్ హైట్స్ మేయర్ కిమ్ థామస్ ఖండించారు. దీంతో పాటు నగర అధికారులు దర్యాప్తు చేయాలన్నారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. అమెరికాలోని హిందూ సమాజంపై గతంలో ఎన్నడూ లేనంతగా విద్వేశం, ద్వేశపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. ఆందోళనలు రేకిస్తున్నాయని చెప్పింది. హిందూ అమెరికన్ సమాజాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలను దేశంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలు బహిరంగంగా, స్పష్టంగా ఖండించాలని కోరింది.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా కూడా ఈ ఘటనను ఖండించి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ద్వేషపూరిత ప్రచారం ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో హిందూ ఆలయంపై దాడిగా మారిందని ఆయన చెప్పారు. ఆలయంలోని వీడియోలను పరిశీలించి నిందితుడిని పట్టుకోవాలని కోరారు. మరో పది రోజుల్లో అమెరికాలోని భారతీయ-అమెరికన్ సమాజం హిందూ హెరిటేజ్ మంత్ జగనుంది. ఈ కార్యక్రమంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఈ ఉత్సవాల జరుపుకునే కొద్ది రోజుల ముందే ఈ దాడి జరగడంపై టెన్షన్ నెలకొంది.
అమెరికాలో హిందూ మతపరమైన ప్రదేశాలపై గతంలో జరిగిన దాడులు, విధ్వంస ఘటనలను కూడా CoHNA నమోదు చేసింది. 2022 ఆగస్టులో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో శ్రీ తులసి మందిరంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2023 డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో SMVS శ్రీ స్వామినారాయణ ఆలయంపై గ్రాఫిటీ ఘటన కూడా ఉన్నాయి. 2024లో న్యూయార్క్, కాలిఫోర్నియాలోని BAPS ఆలయాలపై జరిగిన దాడులను కూడా సంస్థ నివేదించింది. గత ఏడాది కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న BAPS ఆలయ గోడలపై ద్వేషపూరిత సందేశాలను రాసి దానిని ధ్వంసం చేసిన ఘటన కూడా చోటుచేసుకుందని హిందూ హక్కుల పరిరక్షణ సంస్థ తెలిపింది. హిందూవులు, ముఖ్యంగా అమెరికాలోని భారతీయులపై దాడులువ ఎప్పుడు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా… ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం ఇలాంటి దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి దాడులు జరగకుండా భారత ప్రభుత్వం నుంచి కూడా అమెరికాపై ఒత్తిడి తేవాలనే వాదనలు కూడా తెరపై వినిపిస్తున్నాయి.


