తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ

తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీఓ 134 జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేన చైర్‌ పర్సన్‌గా, కమిటీ కన్వీనర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా కమిటీ సభ్యుడిగా నియమించింది. వివిధ జిల్లాల్లో భూ అక్రమాలు చేసిన వారిని కమిటీ గుర్తించనుంది. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపై కూడా కమిటీ విచారణ చేయనుంది. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములపై దర్యాప్తు చేయనుంది. మాజీ మంత్రుల కుటుంబ సభ్యుల భూములపైనా విచారణ జరపనుంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి భూములపై నివేదికను తయారు చేయనుంది కమిటీ. ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపై, మల్లన్న సాగర్ భూసేకరణలో అవకతవకలపై, మిడ్ మానేరు భూసేకరణలో అవకతవకలపైనా కమిటీ విచారణ జరిపి సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించనుంది ఈ కమిటీ.

Latest Articles

కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట

బాలాపూర్‌ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్