ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూజా కార్యక్రమం సందర్భంగా ఆధార్ కార్డు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో అరవింద్‌సింగ్ అనే వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి భార్య బబితతో పాటు ఇద్దరు పూజారులు మృతి చెందారు. అనంతరం అరవింద్‌సింగ్ ఇంట్లోకి వెళ్లి తన ముగ్గురు పిల్లలతో ఓ గదిలో బంధించుకున్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బయటకు రావాలని కోరారు. బయటకు వచ్చేందుకు నిందితుడు నిరాకరించాడు. పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో అరవింద్ సింగ్‌తో పాటు తన కుమారుడికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ సింగ్, కుమారుడు మృతి చెందారు. అతని ఇద్దరు కుమార్తెలను పోలీసులు రక్షించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఏడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది.
భార్య, ఇద్దరు పూజారులపై కాల్పులు.. పిల్లలతో గదిలో బంధించుకుని..
0
18
Latest Articles
ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -
- Advertisement -


