దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడంతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించడాన్ని నిలిపివేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించి అనర్హత వేటు వేసిందని ముకుల్ రోహత్గీ తెలిపారు. అత్యవసరంగా విచారణ జరపకపోతే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని అన్నారు. దానం పిటిషన్‌పై బుధవారం సీజేఐ ధర్మాసనం విచారణ జరపనుంది.


