మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి సరైన సినిమా రాలేదు. ఇప్పుడు విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబోలో సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. మరి.. టైటిల్ ఏంటి..? ఈ సినిమా థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు..? మణిరత్నం ఈసారైనా మ్యాజిక్ చేస్తారా..? లేదా..?

విజయ్ సేతుపతి, సాయిపల్లవి.. ఈ ఇద్దరికీ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో మణిరత్నం ఈ జనరేషన్ కి తగ్గ ప్రేమకథను తెరకెక్కిస్తుండడంతో.. అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ మూవీకి ఇంజి వెల్లం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంజి వెల్లం టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి ఇద్దరూ వర్షంలో తడుస్తూ ఒకరినొకరు దగ్గరకు తీసుకుంటూ కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది మణిరత్నం మార్క్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నట్లు అనిపిస్తోంది. ఇందులో సేతుపతి క్లీన్ షేవ్ తో కనిపిస్తుండగా.. సాయి పల్లవి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇది కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని పోస్టర్ ని బట్టి తెలుస్తోంది.

ఇంజి వెల్లం అంటే అల్లం బెల్లం అని అర్థం. తెలుగులో ఇదే టైటిల్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథకు ఆ టైటిల్ కు సంబంధమేంటి? మణిరత్నం ఇలాంటి భిన్నమైన టైటిల్ పెట్టడానికి కారణమేంటి? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇంతకీ.. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. 2027 జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో పొంగల్ సీజన్ లో రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి ఏదైనా కథ ఓకే చేసారంటే అందులో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేస్తుండడంతో.. ఈ సినిమాలో ఏదో విషయం ఉంటుందనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నాయి. మరి.. గత కొంతకాలంగా కెరీర్లో వెనకబడిన మణిరత్నం ఈ సినిమాతో మళ్లీ మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

కోనసీమ అంటే నాకు బాలయోగి గుర్తుకువస్తారు- చంద్రబాబు

కోనసీమ జిల్లా మాచవరంలో సీఎం చంద్రబాబు 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కోనసీమ అంటే తనకు బాలయోగి గుర్తుకువస్తారని అన్నారు. పాలన అంటే సచివాలయంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్