అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల చూస్తున్నానని.. ప్రజా స్వామ్య బద్దంగా ఉండాలి అనేది తన ఆలోచన అని చెప్పారు. హరీశ్‌రావుకు మైక్ ఇస్తే సారీ చెబుతారని అనుకున్నానని.. కానీ డైవర్షన్ చేసే పనిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీరియస్ అయ్యానని చెప్పారు.
ఇంకా స్పీకర్ మాట్లాడుతూ.. ” ప్యానల్ స్పీకర్‌గా కడియం శ్రీహరి ఉంటారు. హరీష్‌రావు పదేళ్లు మంత్రిగా పని చేశారు. కనీసం స్పందించకపోతే ఎలా?. నేనే చర్యలు తీసుకోవచ్చు కానీ అలా చేయడం పద్ధతి కాదు. కేటీఆర్, కౌశిక్‌రెడ్డిలు పోలీసులను కొట్టే వీడియోలు కనిపించాయి. మహిళా ఎమ్మెల్యేల అంశంపై సీఎం సీరియస్‌గా ఉన్నారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం” అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.


