తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీజేపీ ప్రతినిధులు కలిశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బకాయిలు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కమలనాథులు కోరారు. ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. శాసనసభలో ఒకరోజు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ సీఎం రేవంత్ దగ్గరే ఉందని.. కానీ ఆ శాఖలో ఏం జరుగుతుందో అర్థంకావడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లే కారణమని రామచందర్‌రావు తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం.. గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు
0
22
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


