నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?

కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం.”ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి కర్మ, మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడ్డ కర్మ చెడు ఫలితాన్ని తెస్తుంది. ఇదే ప్రాథమికంగా కర్మ సిద్ధాంతం సూత్రం. మీరు ఆలోచించేది, అనుభూతి చెందేది, చేసేది ప్రతిదీ కాస్మిక్ హార్డ్ డ్రైవ్‌లో నమోదవుతుంది. కాలం గడిచేకొద్దీ మీ డేటా మీకు తిరిగొస్తుంది. ఆ డేటా లెక్కకువస్తుంది. క్రమంగా అది నీ జీవితంలో వ్యక్తమవుతుంది.ప్రతిఫలిస్తుంది. అందుకు నిదర్శనం నేలకొరిన నాగరికతలే.

విశాల విశ్వం ఒక కాలచక్రం. దానిపై జననం, మరణం, పునర్జన్మకు లోబడే జీవులన్నీ ఉంటాయి. అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఎప్పటికీ ఆగదు. ఇది విశ్వ చైతన్య చక్రం. వ్యక్తిగా నువ్వు విశ్వ చైతన్యం నుండి వేరని భావించినంత కాలం, ఆ జనన, మరణ, పునర్జన్మ నియమాలకు నిన్ను బానిసగా చేస్తుంది. కానీ విశ్వ చైతన్యం కృప ద్వారా నీ చేతన శక్తి అంతా విశ్వచైతన్యం నుండి వచ్చిందేనని నువ్వు గుర్తించినప్పుడు, నవ్వు అమరత్వాన్ని సాధిస్తావు.ఇది రాత్రికి రాత్రే ఏ మనిషిలో జరగలేదు, జరగదు కూడా.మరి ఎలా కర్మల నుండి బయట పడడం. ఇది సులువనుకున్నవాడికి కష్టం కావచ్చు. కష్టం అనుకున్నవాడికి సులువు కావచ్చు.ఇది ఇలానే జరుగుతుందని సూత్రీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.కానీ వాటిని మనుషుల అంతరాత్మలు గుర్తిస్తాయి. కానీ నోరు బొంకుతుంది. ఇదే అహం..ఇది పోయిన రోజు నువ్వు ఏంటో నీకు అర్థమవుతుంది.మరి అది తెలియాలంటే కర్మ వలలో చిక్కుకోకుండా బయట బడాలంటారు.

మనం చేసే ప్రతి కర్మ ఎక్కడ రికార్డ్ అవుతుంది? అసలు చెడు కర్మ అనేది మన జీవితంలో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? మన జీవితాన్ని శాసించే ఈ కర్మలను తప్పించే శక్తులు ఏవైనా ఈ సృష్టిలో ఉన్నాయా, లేక బతుకును భయపెట్టేలా ఈ కర్మలు మనల్ని వెంటాడతాయా? అసలు ఏది వదులుకుంటే మనం ఈ కర్మల బంధాల నుంచి దూరమవుతాం? మన పునర్జన్మలను నిర్ణయించేది కూడా ఈ కర్మలేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ… కర్మల వెనుక ఉన్న అసలైన మర్మాల లోతులను అందించి మన సనాతన సిద్ధాంతాలు ..శాస్త్ర గ్రంథాలు..

కర్మ అనే పదానికి సంస్కృతంలో “చర్య” అనే అర్థం ఉంది. మనిషి చేసే ఏదైనా శారీరక లేదా మానసిక చర్యను కర్మగా పరిగణిస్తారు. చర్యల ఫలితాలనే కర్మ ఫలాలంటారు. సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారం, జీవితం అనేది అనేక చర్యల ఫలితాలు. ఈ ఫలితాలు అనంతమైన ఒక గొలుసుకట్టు. సరళంగా చెప్పాలంటే ఇది “కారణం, ప్రభావ నియమం” అంటే మీరు ఏది విత్తితే ఆ పంటనే, మీరు కోస్తారు” నిజాయితీ పరులను హింసించే వారిని చూసి, దేవుడనే వాడు ఉన్నాడా అనే సందేహం మనిషికి కలిగుతుంది. అసలు మనుషులనే వాళ్లున్నారా అనే అనుమానం దేవుడికి కలుగుతుంది.

కర్మ సిద్ధాంతం అనేది మానవ ప్రపంచంలో అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. దీని ప్రకారం ఒక వ్యక్తి చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. ఇది భారతీయ మతాలైన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో ప్రముఖంగా కనిపిస్తాయి.కర్మలు మూడు రకాలుంటాయని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అవి ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలుగా మానవులకు కర్మ ఫలాలను అందిస్తాయి. మనం పూర్వ జన్మలో చేసే పనులకు ఫలితంగా వచ్చేవి సంచిత కర్మలు…వీటి కారణంగానే వర్తమానంలో జన్మిస్తాం. ఈ సంచితం నుంచి కొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత ప్రారబ్ద కర్మను తీసుకుంటాం. ప్రారబ్దం వల్ల జరిగే కర్మలను ఆగామి కర్మలు అంటాం. పూజలు, యజ్ఞ యాగాలు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం, పుష్కర స్నానాలతో ఆగామి కర్మల నుంచి తప్పించుకోవచ్చు. సంచిత, ప్రారబ్ద కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదంటుంది కర్మసిద్ధాంతం.

నదీనాం సాగరో గతిః అన్నట్టు ప్రతీ కర్మ దాని ప్రతి చర్యగా కర్మఫలితాన్ని ఇవ్వడమే. ఎంతటి యోగీ, పరమహంస అయినా … బుద్ధిఃకర్మానుసారిణి అన్న చందాన కర్మబద్దులుగాకతప్పదు. ప్రతి రోజు మంచి కర్మల ఆచరణతోనే కర్మవిముక్తుడవుతాడు. ఒకరు నలుగురుని మాటలతోనో… మానసికంగానో… కొట్టడం చేత శారీరకంగానో …హింసించి, అకస్మాత్తుగా మరణించాడు…ఆ కర్మ మరుజన్మకు కారణమై ఈ జన్మలో దాని ఫలితాన్ని పొంది అనుభవిస్తాడు.ఇది ఒక కాల చక్ర నియమం…ఇది జనన మరణ కాలం సమయాలను బట్టి, జన్మలను తీసుకుకోవడం జరుగుతుంది.

సనాతన ధర్మంలో కర్మ అనేది అన్ని జీవితాలను నియంత్రించే ఆధ్యాత్మికం చట్టంగా పరిగణించబడుతుంది. కర్మ అనేది ఈ జన్మలో, గత జన్మలో ఒకరి చర్యల మొత్తాన్ని, వాటితోపాటు వచ్చే ప్రతిచర్యలను సూచిస్తుంది. ఇవన్నీ సమష్టిగా ఒకరి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీనిని విస్తృతంగా విధి అని పిలుస్తారు.ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ నియమం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇతర విశ్వాసాలు మానవ జీవితంలోని అన్ని సంఘటనలను దేవుని సంకల్పంగా చూస్తాయి. కానీ సనాతన ధర్మంలో ఒక జీవి స్థితిలో కర్మకు, దేవునికి ఎటువంటి పాత్ర, సంబంధం, ప్రభావాలులేవు. దేవుడు మానవాళిని శిక్షించడు, అలాగని ప్రతిఫలాలు ఇవ్వడు. ప్రతీ విషయం నీ సొంత కర్మల కారణంగా జరుగుతుంది. అదే ప్రారబ్ద కర్మ. ఈ ప్రపంచంలో అస్తవ్యస్తంగా లేదా చంచలంగా ఏమీ లేదు. ఈ విశ్వంలో విషయాలు యాదృచ్ఛికంగా లేదా దేవుని సంకల్పంతో జరగవు. ఏం జరగాలనుందో! అ ది మాత్రం క్రమం తప్పకుండా జరుగుతుంది. జీవితంలో చాలా సంఘటనలు ఒకదానికొకటి క్రమం తప్పకుండా జరుగుతాయి. కర్మ నియమం అని పిలువబడే దేవుడు నిర్దేశించిన పరిపూర్ణ వ్యవస్థ ప్రకారం అవి ఖచ్చితంగా జరుగుతాయి.

ఒక ఆవు వేల ఇతర దూడలలో తన దూడను చాలా తేలికగా గుర్తిస్తుంది. ఒక ల్యాగ దూడ కూడా వందల తల్లుల్లో తన తల్లి ఆవును గుర్తిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సామర్థ్యం. అదేవిధంగా ఈ గ్రహం మీద ఉన్న లక్షలాది దూడలలో మన కర్మ మనల్ని కనుక్కొంటుందని చెబుతుంది శ్రీమద్ భాగవతం. మనిషి చేసే కర్మ తాలూకు దృశ్యం…శబ్దం విశ్వ చైతన్యంలో విద్యుదయిస్కాంత తరంగాలుగా ప్రయాణిస్తాయి. వాటిని నీ కంటితో నువ్వు చూడలేవు. అవి నీ రూపాన్ని, నీ కర్మని, నిర్ణీత ప్రదేశానికి చేరుస్తాయి. తిరిగి వాటిని కర్మల ఫలితాలగా నీ అనుభవంలోకి తెస్తాయి. నీకు చెడు చేసిన వాడిని, అవమానించాలనో శిక్షించాలనో నువ్వు చూస్తే, వాళ్ల కథనే కర్మలో నువ్వు చిక్కుకుంటావు…ఇది నీకు అర్థమైతే…నవ్వు ఎప్పుడు కర్మల్లో చిక్కుకోవు,,, ఇది నీకు ఎప్పుడు ఎలా అర్థమవుతుంది? అదే కర్మ నిగూఢ రహస్యం…
దాని మర్మం ఏమిటో చూద్దాం.

కంచి పరమాచార్య, ప్రారబ్ద కర్మను స్వీయ చిరునామా కలిగిన ప్రీ-పెయిడ్ స్టాంప్డ్ కవరుతో పోల్చారు. దాని చిరునామాదారుడికి అది చేరుతుందని చెప్పారు.కృష్ణుడు భగవద్గీతలో ”గహన కర్మణో గతిః అన్నాడు. అంటే కర్మ నియమం లోతైంది. సులభంగా అర్థం చేసుకోలేనిది.చర్య, ప్రతిచర్య ఎలా పనిచేస్తుందో ఎవరూ సులభంగా అర్థం చేసుకోలేరు. ఏ సమయంలో… ఏ స్థితిలో… ఏ ప్రతిచర్య ఇవ్వాలో దైవానికి బాగా తెలుసు. ఈ జీవితంలో కొంత ప్రతిచర్య రావచ్చు, తదుపరి జీవితంలో కొంత, భవిష్యత్తులో కొంత ప్రతిచర్య రావచ్చు. ఏ కర్మ ఎప్పుడు ఎలా మింగే’స్తుందో చెప్పలేం.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, ధృతరాష్ట్రుడు కృష్ణుడిని, “నాకు 100 మంది కుమారులు ఉన్నారు. వారందరూ చనిపోయారు. ఎందుకు?” అని అడిగాడు. కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, ‘గత ఏబై జన్మల క్రితం, నువ్వు వేటగాడివి. వేటాడేటప్పుడు, నువ్వు ఒక మగ పక్షిని కాల్చడానికి ప్రయత్నించావు. అది ఎగిరిపోయింది. కోపంతో, నువ్వు గూడులోని వంద పక్షి పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపావు. తండ్రి-పక్షి నిస్సహాయంగా వేదనతో చూడాల్సి వచ్చింది. ఆ తండ్రి-పక్షికి తన వందమంది కొడుకుల మరణాన్ని చూసి, బాధ కలిగించినందున, నీ వందమంది కొడుకులు చనిపోవడం వల్ల కలిగే బాధను నువ్వు కూడా అనుభరించాల్సి వచ్చిందన్నాడు.

దీంతో ధృతరాష్ట్రుడు,ఇది సరే, కానీ నేను యాభై జన్మల కోసం ఎందుకు వేచి ఉండాల్సి వచ్చింది? అని అడిగాడు. కృష్ణుడు ఆ సందేహానికి సమాధానమిస్తూ… గత యాభై జన్మలలో నువ్వు వంద మంది కుమారులను పొందడానికి ‘పుణ్యం’ కూడబెట్టుకున్నావు. ఆ తర్వాత యాభై జన్మల క్రితం నువ్వు చేసిన ‘పాపం’ వంతు వచ్చింది. అని జవాబిచ్చాడు.రామాయణంలో కూడా ఇలాంటి కర్మకథ కారణంగానే దశరథుడు పుత్ర వియోగ దుఃఖాన్ని పొందాడంటారు. ఇక్కడ తండ్రి చేసిన పాపాన్ని కేవలం దశరథుడు మాత్రమే అనుభవించలేదు. శ్రీరామ చంద్రుడు అనుభవించాడు.ఇలాంటి కథలు పురాణ, ఇతిహాసాల్లో
చాలా కనిపిస్తాయి.

దైవం నీ కర్మలను నెమ్మదిగా రోటిలో రుబ్బుతుంది. దాన్ని చక్కటి పదార్థాలుగా నీకు అందిస్తుంది. “కర్మ నియమం పనిచేయడానికి నెమ్మదిగా ఉండవచ్చు. కానీ ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు”.ప్రతి ఒక్కరూ తమ మాటలు, చర్యలు, ఆలోచనల గురించి చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. అగ్ని ఒక వస్తువును నాశనం చేస్తుంది.ఆ తరువాత అది దానంతట అదే ఆరిపోతుంది. కానీ చెడు కర్మల ప్రభావాలు అనేక జన్మలను అనుసరిస్తాయి. ప్రతి జన్మలోనూ ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. ఇది కర్మ నియమం ….ఇది తప్పదు …తప్పించుకోలేవు.

మనకు మనమే గొప్పవాళ్లం అనుకునే వాళ్లు ఎప్పటికైనా జీవితంలో ఎదురు దెబ్బతింటారు.ఎదుటివారిని హీనంగా చూసే గుణం మనసు చేసే కర్మ….నువ్వు దేనితో కర్మను చేశావో అదే తిరిగి బాధను అనుభవించే రోజువస్తుంది.కాకపోతే అది అజ్ఞానం వల్ల గుర్తిండం సాధ్యం కాదు. అందుకే ప్రతీ ఒక్కరు గమనించాల్సింది ఏమిటంటే…విశ్వంలో ఎవరూ దోషులుకారని, ముందుగా తెలుసుకోవాలి? ఇతరులను నిందించేవారిదే తప్పు. ఇతరులను దోషులుగా చూచేవారే దోషులు. ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారం ఎవరు దేనికి అర్హులో వాళ్ళు దాన్నే పొందుతారు. వాళ్లు కొత్తగా తప్పులను ఈ రోజు సృష్టించుకోవటం లేదు. ఇప్పడు మీరు అనుభవించేదంతా గతకర్మల ఫలస్వరూపం. ఈ రోజు ఒకడు పశ్చాత్తాప పడ్తుండొచ్చు…మరు జన్మకు అవితొలగిపోవచ్చు లేదా ఈ జన్మకే తొలగించుకోవచ్చు. నువ్వు కర్మనే బోనులో దోషిగానే పుట్టావు.మరొకరి దోషాన్ని వేలెత్తి చూపితే మరో కర్మవలయంలో నువ్వు చిక్కినట్టే ఇక మరో జన్మకు నువ్వు సిద్ధం కా…అంటుంది కర్మ సిద్ధాంతం ఇది నిజమేనా?

కర్మకు ఒక వలయం ఉంది. ఆ ప్రాంతంలో మీరు ఏది విత్తితే ఆ పంటే అందుకుంటారు.ఆనందం, శాంతి, ప్రేమ,స్నేహాన్ని పొందాలంటే, ఒకరు సంతోషంగా, శాంతియుతంగా, ప్రేమగా నిజమైన స్నేహితుడిగా ఉండాలి. అనంతమైన విశ్వ శక్తిలోకి మీరు ఏది పంపితే అదే తిరిగి వస్తుంది. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇదే న్యూటన్ థియరీ కూడా… మీరు ఏదో అదే పొందుతారు.

జీవితం సవ్యంగా జరగాలంటే భాగస్వామ్యం అవసరం. అది దానంతట అదే జరగదు. మనం లోపల, వెలుపల విశ్వంతో ఒకటిగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మన అంతర్గత స్థితికి సంబంధించిన ఆధారాలను ఇస్తుంది. మీ జీవితంలో మీరు ఏమి కోరుకుంటున్నారో దాంతో మిమ్మల్నిమీరు చుట్టుముట్టండి . మీ చుట్టూ మీరు మాత్రమే ఉండండి.అప్పుడే మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది.

మీ చూపంతా మీ శత్రునాశనంవైపే ఉంటే ప్రతికూల లక్షణాలే మిమ్మల్ని ఆవహిస్తాయి. దీంతో మీరు ఉన్నత స్థాయిపై దృష్టి పెట్టలేరు.లక్ష్యాన్ని చేరుకోలేరు. శత్రువుపై పగ మిమ్మల్ని ఏ రోజుకుకారోజు మిమ్మల్ని ఇంకా ఇంకా కింది స్థాయి చేర్చి, పతనం చేస్తుంది.ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్ళితే అక్కడే ఉండిపోతారు..మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మారాల్సింది మీరే తప్ప మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ప్రదేశాలు , వస్తువులు కాదు. మీకు మీరు ఇచ్చుకునేదంతా మీరే….మీకు ఎవ్వరూ ఏమీ ఇవ్వరు. మీపై మీకు మాత్రమే నియంత్రణ ఉంది..మీ మీద మాత్రమే.అది ముందు గుర్తించాలి..మీ హృదయాలలో మీరు ఎవరో? ముందుగా గుర్తించాలి. మీరు మీ మార్గాన్నిమార్చుకున్నప్పుడు, మీ జీవితాలు కూడా వాటిని అనుసరిస్తాయి..అదేక్రమంలో మీ భవిష్యత్తు విధానాలు మారతాయి.

ఒకరి జీవితంలో ఏదో తప్పు ఉంటే, మీ జీవితంలోనూ ఏదో తప్పు ఉంటుంది.మన చుట్టూ ఉన్న వాటిని మనమే ప్రతిబింబిస్తాం. మన చుట్టూ ఉన్నవి మనలను ప్రతిబింబిస్తాయి. ఇది ఒక సార్వత్రిక సత్యం. ఎవరి జీవితంలో ఉన్న తప్పులకు ఒప్పులకు వాళ్లే బాధ్యత వహించాలి. అంతేకాని వాటిని వేరొకరు బాధ్యతగా భావించి, నిందించడం కర్మను పోగేసుకోవడం…ఇది కర్మ సూత్రం…చర్యకు ప్రతిచర్య… అసలు ఒకరి కర్మకు నువ్వు ఎందుకు సాక్షి కావాలనుకుంటున్నావు. అలా అవ్వాలని నువ్వు అనుకున్న క్షణమే అంతకు పదిరెట్లు చెడు కర్మఫలానికి నువ్వు దారులు వేసుకున్నట్టే.

విశ్వంలో ప్రతిదీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు తరువాత దశకు దారితీస్తుంది. ఒక పనిని పూర్తి చేయడానికి ఎవరైనా పని ప్రారంభించాలి కదా. ఇక్కడ మీరు వేసే మొదటి అడుగు, చివరి అడుగు మీ కర్మల ఫలితాలకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగుంటాయి. పనిని పూర్తి చేయడానికి ఇవి రెండూ అవసరం. గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాలన్నీ ఒకదానితో ఒకటి అనుసధానించబడతాయి.భూత కాలం వర్తమానాన్ని ప్రభావితం చేస్తుంది.వర్తమానం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇది కాల సూత్రం..దీన్ని నుండి ఎవరూ తప్పించుకోలేరు.

ఒకే సమయంలో మీరు రెండు విషయాల గురించి ఆలోచించలేరు. మన దృష్టి ఆధ్యాత్మిక విలువలపై ఉంటే, దురాశ, కోపం వంటి ఆలోచనలు మీలో ఉండటం సాధ్యం కాదు.ఎవరైనా ఏదైనా నిజమని నమ్మితే, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వారు ఆ సత్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వస్తుంది. మీరు నేర్చుకున్న వాటిని మీరే ఆచరణలో పెడతారు.భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వెనక్కి వెళ్లకూడదు.. ముందు ఏంఉందో పరిశీలించాలి. అంతేకాని మీరు వెనక్కి చూస్తే, ముందుకు సాగలేరు. పాత ఆలోచనలు, పాత ప్రవర్తనా విధానాలు, పాత కలలు కొత్త వాటిని పొందకుండా నిరోధిస్తాయి. అంతేకాదు మన మార్గాన్ని మార్చుకోవడానికి అవసరమైన పాఠాలను నేర్చుకునే వరకు మీ చరిత్రను, మీ జన్మను విశ్వ చైతన్యం పునరావృతం చేస్తూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన పాఠం..

న్యూటన్ మూడో చలన నియమం ప్రతి చర్యకు, సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుందని చెబుతుంది. ఈ భావన కర్మ సిద్ధాంతానికి సమానంగా ఉంది. స్వార్థంతో కూడిన మన చర్యలు వాస్తవిక ప్రపంచంలో అలలను సృష్టిస్తాయి.ఇవన్నీ ప్రతిచర్యలకు కారణాలై పరస్పర కర్మ భావనకు బదులివ్వడానికి సిద్ధమవుతాయి. క్వాంటం ఫిజిక్స్ ,సిస్టమ్స్ సిద్ధాంతం వంటి రంగాలలో శాస్త్రవేత్తలు విశ్వంలోని ప్రతిదీ ఎలా సంక్లిష్టంగా అనుసంధానించబడిందో కనుగొంటున్నారు. ఈ అవగాహన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు నొక్కిచెప్పే పరస్పర సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

మీ కలలో మీరు సమస్యాత్మక జీవితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. దాని గురించి నువ్వు ఆందోళన చెందవచ్చు. మీరు మేల్కొన్నప్పుడు అలాంటి సమస్య లేదని మీరు గమనించవచ్చు. అదేవిధంగా, అహం దాని నిజమైన స్వభావానికి మేల్కొన్నప్పుడు, చర్యల ద్వారా పుట్టిన అన్ని అజ్ఞాన ఫలితాలు అంతమవుతాయి. కర్మను తుడిచిపెట్టగల ఒక విషయం ఉంది. అది స్వీయ జ్ఞానం, స్వీయ అవగాహన. ఈ విషయంలో ముండకోపనిషత్ ఇలా చెబుతుంది.

“భిద్యతే హృద్య-గ్రంధి చిద్యన్తే సర్వ-సంశయ
క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావారే.”

దీని అర్థం “స్వార్థ దర్శనం జరిగినప్పుడు హృదయ ముడి తెగిపోతుంది, అన్ని సందేహాలు తొలగిపోతాయి. అన్ని కర్మలు తొలగిపోతాయి.ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం నశించడంతో, కోరికలు తత్ఫలిత చర్యలు కూడా ముగుస్తాయి. మూడు ముడులు ఉంటాయి. శరీరంతో గుర్తింపు మొదటి ముడి. ఆలోచనలు, కోరికలు, జ్ఞాపకాలతో గుర్తింపు రెండో ముడి. మంచి చర్యల ఫలితంతో గుర్తింపు మూడో ముడి. ఈ మూడు ముడులు తొలగిపోయినప్పుడు అన్ని రకాల కర్మలు తొలగిపోతాయని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

ఒకేసారి మొత్తం కర్మను ఎలా ఆపగలం? అనే సందేహానికి సమాధానం ఒకటే అహాన్ని అంతం చేయడమే.. అసలు కర్మలను చేయడానికి, అనుభవించడానికి కారణం అహం. అది నాశనం అయితే మూడు రకాల కర్మలు ఒకేసారి ముగుస్తాయి. 114 చక్ర ధ్యానాలు. ప్రాణాయామం, కుండలిని యోగా, క్రియా యోగా అనేవి గత కర్మలను క్లియర్ చేయడానికి ప్రత్యక్ష మార్గాలు. ఓం జపం, లేదా ఓం ధ్యానం అన్ని కర్మలను క్లియర్ చేస్తాయి. మీలో కరుణ, ప్రేమ ఉంటే, మీలో మంచి కర్మ పెరుగుతుంది.

కర్మ అనేది బౌద్ధ, హిందూ, జైన, సిక్కు మతాలు స్వీకరించిన పురాతన భారతీయ భావన. చరిత్ర, సంస్కృతులలో కొన్ని రంగులు కర్మలతో ముడిపడి ఉన్నాయి. ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ అనేవి కర్మలకు సంబంధించిన కొన్ని ప్రధాన రంగులు. ఈ ప్రతీకవాదం సాంస్కృతిక, మతపరమైన కథలు, గ్రంథాలు, సంప్రదాయాల నుండి ఉద్భవించాయి. ఎరుపు రంగు సాధారణంగా బహుళ సంస్కృతులలో కర్మ, విధికి సంబంధించింది. అనేక ఆసియా సంప్రదాయాలలో ఎరుపు రంగు అదృష్టాన్ని సూచిస్తుంది. చైనీస్ సంస్కృతిలో ఎరుపు అనేది శుభప్రదమైన రంగు స్థానిక అమెరికన్ సంస్కృతిలో ప్రాణశక్తి, తేజస్సుకు కూడా అనుసంధానం అవుతుంది. హిందూ మతం, బౌద్ధమతంలో ఎరుపు రంగు స్త్రీ శక్తితో ముడిపడి ఉంది. హిందూ మహిళల కనుబొమ్మల మధ్య పెట్టుకునే ఎరుపు ‘చుక్క’ లేదా బొట్టు ప్రాణాన్ని, ప్రాణశక్తిని సూచిస్తుంది. అంతర్ దృష్టి, అంతర్గత జ్ఞానాన్ని సూచించే ఆజ్ఞ లేదా ‘మూడో కన్ను’ చక్రంతో అనుసంధానించబడి ఉంటుంది. చెడు కర్మలను నివారించడానికి అనేక సంప్రదాయాలలో ఎర్రటి దారాలను కూడా ధరిస్తారు. దురదృష్టం నుండి రక్షణ కల్పిస్తాయని నమ్మే ఇతర సింబాలిక్ ఎరుపు వస్తువులలో మధ్యధరా సముద్రంలోని చెడు దృష్టిని నివారించడానికి లాకెట్టు, టర్కిష్ నాజర్, చైనీస్ ముడి ఉన్నాయి.

మానవ చరిత్రలో తొలి తత్వవేత్తలలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఆయన మొదట కర్మ సిద్ధాంత భావనను పురాతన గ్రంథమైన బృహదారణ్యక ఉపనిషత్తులలో ప్రవేశపెట్టారు. ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో విశ్వం మీ చర్యలు, ఆలోచనలకు, కోరికలకు ప్రతిస్పందిస్తుందని కర్మ సూత్రం ధృవీకరిస్తుందన్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. మరి ఈ విశ్వ తత్త్వాన్ని అర్థం చేసుకుంటే కర్మల నుండి చాలా సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది.

Latest Articles

రాష్ట్రంలో 74కు పైగా రైల్వేస్టేషన్‌లను ఆధునీకరిస్తున్నాం- ప్రధాని మోదీ

ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వర్ణాంధ్రప్రదేశకు ఇదొక శుభదినమని మోదీ ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్