మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. చియాపాస్ రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణమైన ప్యూర్టో మడెరోలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మెక్సికో తీరంలో సునామీ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంప కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లోనూ కనిపించింది. గ్వాటెమాలా సిటీలో భవనాలు కంపించడంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం ధాటికి కొన్ని భవనాలు ఊగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెక్సికోలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో నమోదు
0
16
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


