ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మమురా అనే గ్రామంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా నాలుగు అంతస్తుల భవనమంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చూసి నివాసితులు ఆందోళనకు గురయ్యారు. కిందినుంచి బయటికి వచ్చే వీలులేకపోవడంతో.. భవనం పై అంతస్తు నుంచి పక్కనే ఉన్న మరో భవనం పైకి నిచ్చెన కర్రలను వేసి.. బాధితులను రక్షించారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం
0
137
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


