ఐకాన్ స్టార్.. ప్రయోగం చేయబోతున్నాడా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ రాకా. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కానీ.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీతో ఐకాన్ స్టార్ ప్రయోగం చేయబోతున్నాడనే వార్త లీకైంది. దీంతో రాకాలో బన్నీ చేసే ప్రయోగం గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బన్నీ చేసే ప్రయోగం ఏంటి..? రాకా గ్లింప్స్ వచ్చేది ఎప్పుడు..?

రాకా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్. ఫస్ట్ లుక్ తో రాకా మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే.. అసలు రాకా కథ ఏంటి..? సినిమా ఎలా ఉండబోతుంది..? అసలు బన్నీ క్యారెక్టర్ ఏంటి..? హీరో అండ్ విలన్.. ఈ రెండు పాత్రలు బన్నీనే చేస్తున్నాడా..? లేక విలన్ క్యారెక్టర్ సపరేటుగా ఉందా..? ఇలా అనేక అనుమానాలు. దీంతో సోషల్ మీడియాలో రాకా గురించి రకరకాలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ, సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా రాకా మూవీలో బన్నీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది.

బన్నీ నాలుగు పాత్రలు చేయడం గురించి మేకర్స్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి కన్ ఫర్మమేషన్ ఇవ్వలేదు. అయితే.. బన్నీతో రెండు పాత్రలే చేయించాలి అనుకున్నా.. బన్నీ నాలుగు పాత్రలు తనే చేస్తానని చెప్పాడట. ముందు అట్లీ ఆలోచనలోపడినా.. లుక్ టెస్ట్స్‌లో బన్నీ చూపించిన బాడీ లాంగ్వేజ్, గెటప్ వేరియేషన్స్ చూసిన తర్వాత నాలుగు పాత్రలూ ఆయనే చేయడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని ఓకే చెప్పాడట. ఇది ఒకరంగా ప్రయోగమే. ఈ భారీ క్రేజీ మూవీని 2027 డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. బన్నీ, అట్లీ కలిసి రాకా మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Latest Articles

ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు

ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్