రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలంలో కూడా పనులకు ఆటంకం లేకుండా జరుగుతున్నాయని ఇంజినీర్లు వివరించారు. ఇప్పటికే పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి చర్చించారు. రైతుల ఎల్పీఎస్ ప్లాట్ ల అభివృద్ధి, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన పనుల పురోగతిపైనా చర్చించారు. వీలైనంత త్వరగా అధికారులు, ఉద్యోగుల నివాసాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి సూచించారు.
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
0
83
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


