శ్రీనివాస మంగాపురం.. పోటీకి భయపడిందా..?

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు శ్రీనివాస మంగాపురం సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్‌ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండడం.. ఈ మూవీకి అజయ్ భూపతి డైరెక్టర్ కావడంతో ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. జులై 9న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం రావడం లేదని.. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యిందని న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఏమైంది..? ఈ పోస్ట్ పోన్ వెనకున్న అసలు రీజన్ ఏంటి..? ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుంది..?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం ఈ నెల 9న విడుదల చేయాలని డేట్ లాక్ చేయడం.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే.. సడన్ గా ప్రమోషన్స్ ఆపేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ కూడా లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకు ఈ మూవీని పోస్ట్ పోన్ చేసారంటే.. జులై 3న రావు బహదూర్, నాగబంధం సినిమాలు వస్తున్నాయి. కంటెంట్ పరంగా మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 10న అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార సంస్థలు చాలా ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింతగా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాల మధ్య శ్రీనివాస మంగాపురం రిలీజ్ చేస్తే.. జయకృష్ణ పోరాడాల్సి ఉంటుంది. దీనికి తోడు కేవలం పది రోజులు టైమ్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైమ్లో ఈవెంట్లు చేసి, బజ్ పెంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఈవెంట్ కు వచ్చేందుకు మహేష్ బాబు కూడా అందుబాటులో లేరని టాక్ వినిపిస్తోంది. ఇంత పోటీ మధ్య రిలీజ్ చేసి ఇబ్బంది పడటం కంటే సేఫ్ గా మరో డేట్ చూసుకుని రిలీజ్ చేయడం మంచిదని పోస్ట్ పోన్ చేశారని తెలిసింది. విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ లవ్ డ్రామా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. లవ్ స్టోరీ అయినప్పటికీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా జాగ్రత్త వహించారట. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు రానుందంటే.. ఈ నెలాఖరున లేదా ఆగష్టు ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారని సమాచారం.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్