ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ కాలేజీలో జరిగిన విద్యార్థుల కాంక్లెవ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజర్వేషన్లపై మాట్లాడారు. OCలో వెనుకపడిన వారు రేషన్ కార్డ్, పెన్షన్, అడ్మిషన్, ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఓ విద్యార్థి వివరించింది. ఓసీలలో సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఎలాంటి సపోర్ట్ లేకుండా తనలాంటి వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది . ఎస్సీ లు వెనుకబడి ఉండడం వల్ల వాళ్లకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని ఈ సందర్భంగా నితిన్ నబిన్ తెలిపారు. సింగిల్ పేరెంట్ OC లకు న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమే ప్రధాన మంత్రి EWS రిజర్వేషన్ తీసుకొచ్చారని చెప్పారు. సింగిల్ పేరెంట్ ఉన్న వారికోసం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆలోచించాలని సూచించారు.
సింగిల్ పేరెంట్ ఓసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది- నితిన్ నబీన్
0
44
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


