నిద్ర లేదు.. ఆహారం లేదు…నిత్యం నరకం చూపించారు. మంచి జీతం ఇస్తామని ఆశ చూపించి కర్మాగారానికి తీసుకొచ్చారు. ఫోన్స్ లాగేసుకున్నారు. తుపాకీతో బెదిరించి, కెమెరాలతో నిఘా పెట్టి, నిర్బంధంచి వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లా మండీ గ్రామంలో డిస్పోజబుల్ ప్లేట్ల తయారీ కర్మాగారం యజమాని ఆకృత్యం ఇది. బస్టాండుల్లో, రైల్వేస్టేషన్ల నుంచి కొంతమందిని తీసుకొచ్చి బంధించి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఆహారం పెట్టకుండా.. ఎవరితో మాట్లాడనీయకుండా వేధించారు. వీరి వేధింపులకు తాళలేక ఓ కార్మికుడు బలైపోయాడు. అతని శవాన్ని మాయం చేశారు.
నరకకూపం నుంచి ఓ కార్మికుడు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటికొచ్చింది. కర్మాగారంపై దాడి చేసిన పోలీసులు.. 12 మంది కార్మికులకు ఎట్టకేలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. కార్మికులకు శరీరమంతా గాయాలను గుర్తించారు పోలీసులు.
నిద్ర లేదు.. ఆహారం లేదు…నిత్యం నరకం..వెట్టిచాకిరీ నుంచి 12 మందికి విముక్తి
Latest Articles
- Advertisement -


