సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని చెప్పింది సిట్. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపర్చలేదని వెల్లడించింది. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేశారని..సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసినట్టు..ఏ ఆధారాలున్నాయని కోర్టు ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా సీసీ ఫుటేజ్ మాయం చేశారని న్యాయవాది తెలిపారు.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. ” సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. కృష్ణలంక పోలీసు స్టేషన్ లో మే 1 నుండి జూన్ 1 వరకు సీసీ పుటేజ్ లభించలేదు. మే 6 మే 8 మధ్య ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ స్టేషన్‌లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో సాయికృష్ణను గుర్తించాడు. మే 6వ తేదీన సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సీఐ నాగరాజుకు అప్పగించారు. సంబంధిత సమయంలో న్యాయస్థానంలో సీఐ నాగరాజు హాజరు పరచలేదు. ఎందుకు హాజరు పరచలేదు అంటే సరైన సమాధానం చెప్పలేదు. కృష్ణలంక పీఎస్ పరిధిలో సీసీటీవీ పుటేజ్ ఎందుకు డిలీట్ చేశారంటే సరైన సమాధానం చెప్పలేదు . సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేసినట్లు డెడ్ బాడీ దహనం చేశారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సాయికృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తాం. పూర్తిగా సహకరించలేదు కాబట్టి కస్టడీకి ఇవ్వండి. కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.” అని సిట్ అధికారులు తెలిపారు.


