మాస్ రాజాని టెన్షన్ పెడుతున్న టాక్సిక్..?

కేజీఎఫ్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మార్చిలో రావాల్సిన సినిమా. ఆతర్వాత జూన్ లో రిలీజ్ అన్నారు. ఆతర్వాత ఆగష్టులో లేదా దసరాకి విడుదల అన్నారు. రీసెంట్ గా.. సంక్రాంతిలో టాక్సిక్ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు టాక్సిక్ మేకర్స్. టాక్సిక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. మాస్ రాజాని టెన్షన్ పెడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. టాక్సిక్ ఎప్పుడు రాబోతుంది..? టాక్సిక్ వలన మాస్ రాజాకి వచ్చిన టెన్షన్ ఏంటి..?

టాక్సిక్ మూవీ రిలీజ్ అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉండేది. ఆమధ్య ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆపేసారు. ఈమధ్య సంక్రాంతికి రిలీజ్ అని ప్రచారం జరగడంతో.. ఇక ఈ ఇయర్లో టాక్సిక్ విడుదల కాదేమో అనుకున్నారు సినీ అభిమానులు. అయితే.. టాక్సిక్ హఠాత్తుగా ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చి షాక్ ఇచ్చింది. టాక్సిక్ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన ఈ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ ఆగష్టు 21న రిలీజ్ కావాలి. అయితే.. ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని.. మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాని అదే డేట్ కి అంటే ఆగష్టు 21న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. టాక్సిక్ మూవీకి కేవలం అయిదు రోజుల ముందు ఇరుముడి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏపీ తెలంగాణతో పాటు దక్షిణాది బిజినెస్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు టాక్సిక్ వస్తుంది కాబట్టి వీళ్ళేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మాస్ మహారాజా ఇటీవల నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి రూటు మార్చాడు. రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా తండ్రీ – కూతురు నేపథ్యంతో ఇరుముడి సినిమా చేసాడు. ఇప్పటి వరుకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఈసారి రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని టాక్ విపిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో టాక్సిక్ వస్తే.. ఇబ్బందే. అందుకనే.. మాస్ రాజా టెన్షన్ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. టాక్సిక్ కి త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే ఇరుముడికి సంబంధించి కూడా ప్రమోషన్స్ గట్టిగా చేయాలి అనుకుంటున్నారట. మరి.. టాక్సిక్ పోటీని తట్టుకుని ఇరుముడి ఎంత వరుకు ఆకట్టుకుంటుందో..? ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో..? చూడాలి.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్