జీ7లో అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత్ ఈ కూటమిలో అధికారిక సభ్యదేశం కాకపోయినా, ప్రత్యేక ఆహ్వానిత దేశంగా తరచూ ఆహ్వానం అందుకుంటోంది. ఇది అంతర్జాతీయ వేదికపై భారత్ గళానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మరి జీ7లో సభ్యదేశం కాకపోయినా భారత్‌కు ఎందుకు ప్రత్యేక ఆహ్వానం అందుతోంది?
1..అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున బలమైన స్వరంగా భారత్ మారింది.
2..ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి
3..ఇండో-పసిఫిక్‌లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తిగా భారత్
4..ప్రపంచ వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ కీలకం
5..స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
6…అంతర్జాతీయ వేదికపై ప్రభావవంతమైన శక్తిగా భారత్


