రైతాంగాన్ని అదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అన్నారు. పేదలు కూడా సన్న బియ్యం తినాలి.. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై కేబినెట్ సబ్ కమిటి చర్చించింది. ఈ సందర్భంగా రైతులకు లాభదాయకమైన BPT 5204, తెలంగాణ సోనా (RNR 15048), KNM-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆయా పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
పేదలు సన్న బియ్యం తినాలి.. రైతులు ఆర్థికంగా ఎదగాలి- భట్టి
0
15
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


