శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. దీంతో ఆపరేషన్ టైగర్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన చారిత్రాత్మక శివసేన చీలిక తర్వాత, ఇప్పుడు ఉద్ధవ్ థాక్రేకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పార్టీని వీడాలని భావిస్తున్న ఎంపీలు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంతో రహస్యంగా సంప్రదింపులు కొనసాగించినట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోందనే చర్చ సాగుతోంది.


