ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్‌లో థార్ గ్యాంగ్ కనిపిస్తోంది. ఈ విజువల్స్ ఆధారంగా భారీ దోపిడీ థార్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ దోపిడీ థార్ గ్యాంగ్ చేసిందా లేక మరే గ్యాంగ్ చేసిందనే కోణంలో ఏలూరు జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.కాలేజీలో మాస్కులతో ప్రవేశించి సుమారు కోటి రూపాయలపైన నగదును అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు.


