కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్ ప్రాజెక్టు చేపడుతుందని వెల్లడించారు. ఓల్డ్ సిటీతో సహా అన్ని ప్రాంతాలకు మెట్రో రైల్‌ను తీసుకెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్‌ అన్ని రిపోర్టులు సమర్పించింది కాబట్టే మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు అప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. కమీషన్ల కోసం సీఎం నివేదికలు సరిగ్గా సమర్పించ లేదని ఆరోపించారు. ఫైనాన్స్ ఫీజిబిల్ సర్టిఫికెట్ ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టు డీటెయిల్స్‌ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమని చెప్పారు. కేంద్ర మంత్రులను అనేక సార్లు కలిసి అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని అడగడం కరెక్ట్ కాదన్నారు. సీఎం అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్దారు రామచందర్‌ రావు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కమీషన్లు, స్కామ్ ల కోసమే ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్