హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు జరిమానా విధించింది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్ యూసుఫ్‌గూడ సర్వే నం.45లోని 2 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. గత విచారణలో తుది అవకాశం ఇచ్చినా హైడ్రా కమిషనర్ కోర్టుకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా తరఫున దాఖలైన కౌంటర్ పిటిషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. కేసు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.


