రెండు రోజులకే ముగిసిన రాంగ్ నంబర్‌ ప్రేమకథ

రాంగ్ నంబర్‌ ప్రేమకథ రెండు రోజులకే ముగిసింది. రాంగ్‌ నంబర్‌ కారణంగా 19 ఏళ్ల యువకుడితో ఐదుగురి పిల్లల తల్లి ప్రేమాయణం నడిపింది. ఆ కుర్రాడిని పెళ్లి కూడా చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లైన రెండురోజులకే ఆ యువకడు ఆమెను వదిలేశాడు. ‘నువ్వు నాకు నచ్చలేదు.. నువ్వు నాకు వద్దు’ అని తేల్చి చెప్పాడు. దీంతో ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇప్పుడు ఐదుగురి పిల్లలతో ఎక్కడికి వెళ్లాలని తాను రోదిస్తుంది. ప్రియుడిని నమ్మి భర్తను వదిలేసి వచ్చానని.. తన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని సదరు మహిళ వాపోయింది. అయితే ఎవరూ ఏమన్నా ఆ మహిళను వదులుకోబోనని ప్రకటించిన యువకుడు.. రెండు రోజులకే ప్లేట్ ఫిరాయించాడు. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని జముయి జిల్లాలో చోటుచేసుకుంది.

Latest Articles

హైదరాబాద్‌కు రెయిన్‌ అలర్ట్.. 2 గంటల్లో మోస్తరు వర్షం

హైదరాబాద్‌కు రెయిన్‌ అలర్ట్. GHMC పరిధిలో మరో 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కి.మీ....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్