వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే

ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇటీవల తెరకెక్కించిన చిత్రం సింగ్ గీతం. దాదాపు 94 ఏళ్ల వయసులో కూడా ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ప్రయోగాత్మక కథలు, కొత్త ఆలోచనలతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన సింగీతం.. మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మ్యూజికల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన సింగ్ గీతం జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక వరల్డ్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పీల్‌ బర్గ్ కూడా తన కొత్త మూవీతో వస్తున్నారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో ఉన్న ఆయన తెరకెక్కించిన డిస్‌ క్లోజర్ డే జూన్ 12న విడుదల కానుంది. జురాసిక్ పార్క్, ఈటీ, షిండ్లర్స్ లిస్ట్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన స్పీల్‌బర్గ్.. మరోసారి సైన్స్ ఫిక్షన్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ఆ మూవీ ఏలియన్స్ కు సంబంధించిన సీక్రెట్స్ చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వం కొన్ని కీలక విషయాలు దాచిపెడుతుందనే అనుమానాల మధ్య నిజాన్ని వెలికితీయడానికి ఒక ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చేసే పోరాటమే మెయిన్ స్టోరీ లైన్.

సాధారణంగా ఇండస్ట్రీలో న్యూ జెనరేషన్ కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ దర్శకులు వెనక్కి తగ్గుతున్నారనే అభిప్రాయం ఉంటుంది. కానీ సింగీతం శ్రీనివాసరావు, స్టీవెన్ స్పీల్‌ బర్గ్‌ లాంటి దిగ్గజాలు మాత్రం వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని చెబుతున్నారు. కొత్త కథలు చెప్పాలనే కోరిక, ప్రేక్షకులను అలరించాలనే టార్గెట్ ఉంటే క్రియేటివిటీకి ఏజ్ లిమిట్ ఉండదని అంటున్నారు. మరి.. ఈ దిగ్గజ దర్శకులు తమ సినిమాలతో ఎంత వరుకు ఆకట్టుకుంటారో చూడాలి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్