మెగా డైరెక్టర్ తో వెంకీ సినిమా.. ?

వెంకీ.. స్పీడు మామూలుగా లేదు. సినిమా సినిమాకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే.. మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ తో రెడీగా ఉంటున్నారు వెంకీ. లేటెస్ట్ గా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మెగా డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయ్యిందని.. టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. వెంకీని మెప్పించిన మెగా డైరెక్టర్ ఎవరు..? ఈసారి ఎలాంటి జోనర్ లో మూవీ చేయనున్నారు..?

విక్టరీ వెంకటేష్‌.. సైంథవ్ అంటూ యాక్షన్ మూవీ చేస్తే.. డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి రూటు మార్చి తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్ టైనర్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తే.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత చిరు మన వరశంకర్ ప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ చేస్తే.. అది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారు. దసరాకి ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

నెక్ట్స్ మంత్ నుంచి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ క్రేజీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనేది ప్లాన్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వెంకీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అది కూడా మెగా డైరెక్టర్ తో సినిమా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ మెగా డైరెక్టర్ ఎవరంటే.. విశ్వంభర డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ అని సమాచారం.

ఇటీవల వెంకీకి వశిష్ట్ స్టోరీ లైన్ చెప్పారట. ఈ కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట వెంకీ. సురేష్ బాబు కూడా ఈ లైన్ కి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇది ఏ జోనర్ అంటే.. ఒక డిఫరెంట్ యాక్షన్ టచ్ ఉన్న ఎంటర్ టైనర్ గా చెబుతున్నారు. త్వరలో ఫుల్ నెరేషన్ ఉంటుందని.. అంతా ఓకే అయ్యాక అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని సమాచారం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాని ప్రకటిస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వెంకీ స్పీడు మామూలుగా లేదు. మరి.. ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడితో చేసే మల్టీస్టారర్స్ తో బ్లాక్ బస్టర్స్ సాధించి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

టికెట్ విషయంలో వైసీపీ నాయకులు జగన్‌కు షరతులు పెడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అధిష్టానానికి అనూహ్యమైన షరతులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్