రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రణ్ వీర్ ఫ్యాన్స్ అయితే.. తమ అభిమాన హీరో పై కుట్ర జరిగిందని పోస్టులు పెట్టారు. ఇప్పుడు రణ్ వీర్ పై బ్యాన్ ఎత్తివేసారు. అసలు ఎందుకు బ్యాన్ చేసారు…? ఎందుకు ఎత్తివేసారు..? నిజంగానే రణ్ వీర్ పై కుట్ర జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ధురంధర్ మూవీతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. నెక్ట్స్ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటుంటే.. ఊహించని విధంగా రణ్‌ వీర్ సింగ్ పై బ్యాన్ విధించడం అనేది సంచలనంగా మారింది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందాల్సిన డాన్ 3 నుంచి రణ్‌ వీర్ సింగ్ తప్పుకున్నారు. దీని వల్ల నిర్మాతకు 45 కోట్ల నష్టం వచ్చిందని, ఆ కారణంగా ఇండస్ట్రీ నుంచి అతనికి ఎలాంటి సహకారం ఇవ్వకూడదని ప్రెస్ మీట్ మరీ చెప్పడం దుమారం రేపింది. దీంతో రణ్ వీర్ లీగల్ బాట పట్టి సంఘానికి నోటీసులు పంపడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ఈ వివాదం పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అసలు రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ విధించిన సంఘాన్ని బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. రణ్‌ వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తేసినట్టు తాజాగా ప్రకటన వెలువడింది. దీంతో రణ్ వీర్ నెక్స్ట్ సినిమా ప్రళయ్ కు దారి దొరికింది. జాంబీ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటిదాకా రాని డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసింది.

రణ్‌ వీర్ సింగ్ అభిమానులు మాత్రం దురంధర్ సక్సెస్ చూసి ఓర్వలేక కొందరు వెనుక నుంచి ఈ కుట్ర జరిపించారని ఆరోపిస్తుండగా అలాంటిది ఏమి లేదని, రూల్స్ ప్రకారమే చర్యలకు పూనుకున్నామని అసోసియేషన్ చెబుతోంది. ఇక్కడ హీరోలు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఒక సినిమా ఒప్పుకున్నాక వద్దనుకుంటే అదేదో ముందే క్లియర్ గా చెప్పేస్తే బెటర్. ఇలా సంవత్సరాలు గడిచిపోయాక నిర్ణయం తీసుకుంటే నిర్మాతకు నష్టమే. చాలా వరుకు హీరోలు ఇలాగే ఉన్నారని టాక్. మరి.. ఈ విషయంలో హీరోలు మారాల్సిందే.

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్