వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు

తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం క్రితం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించారు. బాధిత వ్యాపారుల పక్షాన నిలిచిన వైసీపీ, దుకాణాలను యథాస్థితిలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించింది. అయితే జూలై 1 నుంచి 30వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకత్వం ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలిపిరి ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అరకు టీ అంగడి సమీపానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని, శ్రీవారి భక్తులు, ప్రజలకు అసౌకర్యం కలిగించే కార్యక్రమాలను సహించబోమన్నారు. అలిపిరి–జూ పార్క్ రోడ్డులో వైసీపీ నిరసన ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్