తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది… పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీలో ఉద్యోగ అవకాశాలు రావాలి

అప్పుడే తెలంగాణ యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేంద్ర దృష్టి పెట్లాలి

నన్ను రావొద్దు అనడానికి మీరెవ్వరు
ఉద్యోగం కోసం ఉపాధి కోసం వచ్చే వారిని భయపెట్టకండి
ట్యాక్స్‌లు కడతున్నాం.. సమాజం కోసం నిలబడతాం
బెదిరిస్తుంటే.. ఎంతకాలం బెదురుతాం
మీరు భయపెట్టే కొద్ది గుండె గట్టిపడుతుంది

నన్ను బెదిరించిన వాళ్ల విషయంలో రాహుల్‌ గాంధీ స్పందించాలి

ఏ రాష్ట్రానికి వెళ్లిన పాస్‌పోర్టులు తీసుకుని రావాలా?

దమ్ముంటే పవన్‌ తెలంగాణ రావొద్దని అసెంబ్లీలో తీర్మానం చేయండి.. చూద్దాం

తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే ఇవాళ పదవుల్లో ఉన్నారు

ఇప్పటంలో కాంగ్రెస్‌ దిమ్మలు కూల్చేస్తే.. నేను నిలబెట్టా- పవన్‌

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు పవన్‌ కళ్యణ్‌ హెచ్చరిక

ఇది భారత్‌ అనుకున్నారా.. పాకిస్తాన్‌ అనుకున్నారా
ఇది నా దేశం.. నేను ఎక్కడైనా అడుగుపెడతా

నేను కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నిస్తున్నా

రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడో వాయనాడ్‌ లో పోటీ చేయొచ్చు
ఇందిరా గాంధీ మెదక్‌ జిల్లాలో పోటీ చేయొచ్చు

తెలంగాణలో జనసేన ఉంటుంది.. మేము పోటీ చేస్తాం
అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం.. నేనే తిరుగుతా

ప్రతి సమస్య మీద మాట్లాడతా

ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం

తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం

చెరువులను కబ్జా చేశానని అంటున్నారు
నిజంగా చెరువులను కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేయరా? ఉంచుతారా?

రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం.. ఆయనంటే గౌరవం

నేను చెరువును కబ్జా చేసి ఉంటే ఆ చెరువును నేను ప్రభుత్వానికి రాసిస్తాను

నాకు మొదటి కేసు తెలంగాణలోనే నమోదైంది
దాడులు కొత్తేమీ కాదు
తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదు

పంజాబ్‌, మహారాష్ట్రలో పార్టీ పెట్టొచ్చు
తెలంగాణలో జనసేన పార్టీ పెట్టకూడదా?
తెలంగాణ సీఎంని అవుతానని భయమా?

2వేల మందితో సభ పెట్టుకుంటామంటే పర్మిషన్‌ కూడా ఇవ్వలేదు

తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తామని భయం

దేశంలో అన్ని జాతులు ఉన్నాయి..
తెలంగాణకు ద్రోహం జరిగితే మొదటి గొంతు మాదే లేచేది

కేసీఆర్‌ ఆంధ్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెడితే స్వాగతించాను

మర్రిచెన్నారెడ్డి.. సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చారు

ఆంధ్రా వాళ్లను తిడుతుంటే.. వాళ్లు ఇక్కడెలా ఉంటారు?

నాకు లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ తెలియదు.. నాది హ్యూమనిజం

నాకు ఎంత కమిట్‌మెంట్‌ లేకపోతే కొండగట్టు ఆంజనేయ స్వామికి టీటీడీ నుంచి రూ.30 కోట్లు ఇప్పిస్తాను?

ఓ విశ్లేషకుడు అమిత్‌ షా , నేను మాట్లాడుకున్నామని చెప్పిన వ్యాఖ్యలను ఖండించాను

జనసైనికులు కేసులు పెట్టారన్న విషయం కూడా నాకు తెలియదు

పాలకులు విద్వేషాలను రెచ్చగొడితే దేశం ఎటువెళ్తుంది?

హైదరాబాద్‌లోకి ఎలా అడుగుపెడతాం అని అంటున్నారు- పవన్‌
నన్ను బెదిరించడానికి మీరెవరు
మీ అయ్య జాగీరా తెలంగాణ- పవన్‌

తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రలో బెదిరింపులే ఎక్కువ

నా మీద దాడి చేయాలంటే ఇంటి దగ్గరే ఉంటాను
భయపడే వాడినే అయితే పార్టీ పెట్టేవాడినే కాదు

తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకమని అంటున్నారు- పవన్
విభజన తీరుకు నేను వ్యతిరేకం- పవన్‌
పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేసిన తీరు తప్పని చెప్పాను- పవన్
తెలంగాణ సంస్కృతికి, రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు

ఓ విశ్లేషకుడు అమిత్‌ షా , నేను మాట్లాడుకున్నామని చెప్పిన వ్యాఖ్యలను ఖండించాను

జూబ్లిహిల్స్‌లో నా ఆఫీసుకు వచ్చి .. గద్దర్‌ కారు కొనివ్వాలని అడిగారు
రెండు రోజుల్లో కారు కొనిచ్చ.. మీరు ఆయనకు ఏం చేశారు?

ఎవరెన్ని తిట్టినా నా గుండెల్లో తెలంగాణ ఉంది

ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదని వైసీపీ అంటే తెలంగాణ ప్రజలు నాకు అండగా నిలబడ్డారు

జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది
తెలంగాణలో జనసేన ఆశయాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పాను
తెలంగాణలో అధికారం కోరుకోవడం లేదు.. ఒక్క మార్పు తప్ప

తెలంగాణ ప్రజలకు ఆంధ్రా మీద విద్వేషం లేదు
తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారే తప్ప ఏపీ మీద ఎలాంటి విద్వేషం లేదు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు

జనసేన రాజకీయాలకు అతీతమైంది- పవన్

తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన పార్టీ- పవన్‌

తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయలకు అతీతం

తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తిని

తెలంగాణ మీద నాకు ప్రేమ

తెలంగాణలో లక్ష మందికి పైగా జనసేన నాయకులు ఉన్నారు

జనసేనకు తెలంగాణ ఎందుకని కొందరు అంటున్నారు

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్