ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈ డైరెక్టర్ పేరు ఒక్కసారిగా బాలీవుడ్లో మారుమ్రోగింది. అయితే.. బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా.. వెంటనే నెక్ట్స్ మూవీని పట్టాలెక్కిస్తారు కానీ.. ప్రశాంత్ వర్మ చాలా టైమ్ తీసుకున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ చిత్రం ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఆతర్వాత సైలెంట్ అయ్యాడు.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ అనుకున్న ప్లాన్ ఏదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ.. ప్రశాంత్ వర్మ నయా ప్లాన్ ఏంటి..?
హను-మాన్ సినిమాతో ఊహించని విధంగా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో భారీ ఆఫర్స్ సొంతం చేసుకున్నాడు. ముందుగా రణవీర్ సింగ్‌తో బ్రహ్మా రాక్షస అనే మైథాలజికల్ ఫిల్మ్ ప్లాన్ చేశారు. అంతా సెట్ అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకునే టైమ్ లో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆతర్వాత బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో సినిమా అనుకున్నాడు. అంతా సెట్ అయిన తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసిన సినిమాలు ఆగిపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు నయా ప్లాన్ రెడీ చేశారు.
ఇటీవల హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పట్టాలెక్కించారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ తో సినిమా చేస్తానని ప్రకటించారు. కానీ.. ఇంత వరుకు అప్ డేట్ లేకపోవడం.. మరో వైపు ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యిందేమో అని ప్రచారం జరిగింది. అయితే.. అలాంటిది ఏమీ లేదని.. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబోలో మూవీ ఉందనేది ఇన్ సైడ్ న్యూస్.
ఇంతకీ.. ప్రశాంత్ వర్మ నయా ప్లాన్ ఏంటంటే.. కొన్ని కథలు రెడీ చేశారు. అయితే.. ఇక గ్యాప్ లేకుండా తన కథలను తనే డైరెక్ట్ చేయాలి అని కాకుండా.. వేరే డైరెక్టర్స్ తో కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట. మహకాళి, జాంబిరెడ్డి సీక్వెల్, అధీర.. ఇలా కొన్ని కథలు రెడీగా ఉన్నాయి. వాటిని వేరే డైరెక్టర్స్ తో చేయిస్తున్నారు. అయితే.. ప్రభాస్ తో సినిమాను మాత్రం తనే డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారు ప్రశాంత్ వర్మ. ఈ మూవీని హోంబేళి ఫిల్మ్స్ నిర్మించనుంది. కాకపోతే ఈ సినిమా చేయాలంటే.. ప్రభాస్ డేట్స్ కోసం ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి.. ప్రశాంత్ వర్మ నయా ప్లాన్ అయినా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.


