నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరువకముందే, ఇవాళ మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో, భద్రతా సిబ్బంది జనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి కళ్యాణ్ బెనర్జీ తలపై బలంగా కొట్టినట్లు కనిపించింది. దెబ్బ తగిలిన వెంటనే ఆయన తన తలను చేతులతో పట్టుకుని కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను రక్షించే ప్రయత్నం చేశారు.
మరో టీఎంసీ ఎంపీపై దాడి… ప. బెంగాల్లో ఉద్రిక్తత
0
63
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


