ఆ యంగ్ హీరో ఓకేసారి మూడు సీక్వెల్స్ చేస్తున్నాడా..?

సీక్వెల్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే ఓకే కానీ.. ఓ యంగ్ హీరో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలకు సీక్వెల్ చేస్తుండడం విశేషం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ జనాలకు తెలిసుండడం.. సక్సెస్ అయ్యుండడం వలన.. సీక్వెల్ మూవీ అంటే.. ఆ క్రేజే వేరు.. ఆ కిక్కే వేరు.. అదే.. కొత్త స్టోరీతో సినిమా చేస్తే.. సక్సెస్ అవుతుందో.? లేదో..? అనే టెన్షన్ ఉంటుంది. ఈ… టెన్షన్ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ వరుసగా మూడు సీక్వెల్స్ చేస్తున్నాడు. ఇంతకీ.. ఆ యంగ్ హీరో ఎవరు..? ఆ త్రి సీక్వెల్స్ ఏంటి..?

తేజ సజ్జ.. హనుమాన్ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. దీంతో ఈ యంగ్ హీరోకు టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అసలు తేజ సజ్జ కెరీర్ గురించి చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలనివుంది సినిమాలో బాలనటుడుగా నటించాడు. ఆతర్వాత రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు.. తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక సమంత ఓ బేబీ సినిమాలో ముఖ్యపాత్రలో నటించి మెప్పించాడు. ఆతర్వాత జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు.

హనుమాన్ మూవీ అయితే.. చిన్న సినిమాగా రిలీజైంది. ఆతర్వాత బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి పెద్ద సినిమా అయ్యింది. జాంబిరెడ్డి, హనుమాన్ సక్సస్ తర్వాత తేజ సజ్జ చేసిన మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీలో వారణాసి .. హిమాలయాలు .. జపాన్ .. టిబెట్ .. మొరాకో ప్రాంతాలలో కథ నడిపించిన విధానం ఆకట్టుకుంది. అలాగే ఈ కథను అశోక చక్రవర్తి కాలం నుంచి తీసుకుని వెళ్లి శ్రీ రాముడికి లింక్ చేసిన విధానం పర్ఫెక్ట్ గా అనిపించి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అందుకనే.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు తేజ సజ్జ.. హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. అయితే.. ఇందులో తేజ సజ్జ తక్కువ సేపే కనిపిస్తారని… కథ మొత్తం రిషబ్ శెట్టి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. తేజ సజ్జ చేస్తున్న మరో సీక్వెల్ జాంబిరెడ్డి. ఈ మూవీకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. అయితే.. ఈసారి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం లేదని.. ఈ మూవీకి ఆయన కథను మాత్రమే అందించి.. దర్శకత్వ బాధ్యతలను వేరే డైరెక్టర్ కి అప్పగించనున్నారని సమాచారం. లేటెస్ట్ గా మిరాయ్ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చింది. వైజాగ్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా.. తేజ సజ్జ.. ఒకేసారి హనుమాన్ సీక్వెల్, జాంబిరెడ్డి సీక్వెల్, మిరాయ్ సీక్వెల్స్ లో నటిస్తుండడం విశేషం. మరి.. ఈ సీక్వెల్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Latest Articles

ఢిల్లీకి రామచందర్‌రావు… అధిష్టానికి బండి భగీరథ్‌ నివేదిక

తెంలగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఢిల్లీకి బయల్దేరారు. హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలను రామచందర్‌రావు కలవనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్ ఎపిసోడ్‌పై పూర్తి నివేదిక కోరింది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్