వచ్చే వారం ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడికి అమెరికా వ్యూహం?

వచ్చే వారం ఇరాన్‌పై మరో సైనిక దాడికి అమెరికా సన్నద్ధమవుతోంది. న్యూయార్క్ టైమ్స్‌లోని నివేదికల ప్రకారం, పెంటగాన్ పలు దాడి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. తుది నిర్ణయం ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉందని.. అవసరమైతే సైనిక చర్యను తీవ్రతరం చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఇరాన్ సైనిక, మౌలిక సదుపాయాలపై భారీ వైమానిక దాడులు చేయడం లక్ష్యాంగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇస్ఫహాన్ అణు కేంద్రంలో భూగర్భంలో పాతిపెట్టిన అణు పదార్థాన్ని బయటికి తీయాలని వాషింగ్టన్ ఆశిస్తోంది. దీంతో పాటుగా యురేనియంను వెలికితీయడానికి అమెరికా ప్రత్యేక కార్యకలాపాల దళాలను దించడం ఒక మార్గం అయితే, ఇటువంటి ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని గణనీయమైన సైనిక నష్టాలకు దారితీయవచ్చని అధికారులు అంగీకరించారు.

అమెరికా మధ్యప్రాచ్యంలో 50 వేల మందికి పైగా సైనికులను మోహరించింది. దీనికి అదనంగా, రెండు విమాన వాహక నౌకలు, డజనుకు పైగా నావికాదళ విధ్వంసకాలు, పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. సుమారు 5 వేల మంది మెరైన్‌లు , 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన 2వేల మంది పారాట్రూపర్లు కూడా.. ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

Latest Articles

చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్‌ జగన్‌ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి( Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్