తాండూరులో అదృశ్యం.. మొయినాబాద్‌ లో ఇద్దరు మహిళల మృతదేహలు

మొయినాబాద్‌లో దారుణం
ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళ దారుణ హత్య
వికారాబాద్‌ నుంచి తీసుకొచ్చి హత్య చేసినట్లు గుర్తింపు
మహిళలు కనిపించడంలేదని కుటుంబసభ్యుల ఫిర్యాదు
4 రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలు

మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి తాండూర్ నుంచి మహిళలను తీసుకువచ్చి ఫామ్ హౌస్ సమీపంలో హత్య చేశారు. మృతులను మహబూబ్బి, అబిదాబిలుగా గుర్తించారు.

తాండూర్‌కు చెందిన మహబూబ్బి, అబిదాబిలని కిడ్నాప్ చేసి మొయినాబాద్‌ తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నాఆరు. ఇద్దరు మహిళలు 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయారని పోలీసులు చెబుతున్నారు.

4 రోజుల క్రితం తాండూరులో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. మహిళలు కనిపించడంలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

మహిళలను తాండూరు నుంచి తీసుకెళ్లి, మొయినాబాద్ సమీపంలోని ఫామ్‌హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ముడిమేల కంచి ప్రాంతంలో అస్తిపంజరాలు లభించినట్లు సమాచారం.

Latest Articles

విశ్వక్ సక్సెస్ కోసం అలా చేస్తున్నాడా…?

తన సినిమాల కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉండే యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలో వరుసగా సక్సెస్ సాధించి... సెన్సేషన్ క్రియేట్ చేసిన విశ్వక్.. ఈమధ్య కాలంలో సరైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్