బండి సంజయ్ కుమారుడిని అప్పగించాలి- రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ పారిపోవడంపై స్పందించారు. నిందితుడు తప్పించుకోవడం సరైన చర్య కాదని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నైతిక బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు. అలా చేస్తే ఆయన గౌరవం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదని సీఎం వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కష్టపడి రాజకీయంగా ఎదిగారని, ఇప్పుడు కుమారుడి వ్యవహారం కారణంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు.

తప్పు చేసినా, చేయకపోయినా చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే కుమారుడిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. ఈ కేసులో ఎవరి తప్పు ఉందో దర్యాప్తు అధికారులు విచారణలో తేలుస్తారని స్పష్టం చేశారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్