కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబంలో ఆందోళన నెలకొంది. ఆయన తల్లి శకుంతల ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
సమాచారం ప్రకారం… శకుంతలకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మెడికవర్ ఆసుపత్రికు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
వైద్యులు అత్యవసరంగా గుండెకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని శకుంతల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


