28.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది.

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవల తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు దక్కింది.

ఈ ముక్కోణపు సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకలోని దంబుల్లా వేదిక కానుంది.

ట్రై సిరీస్ ముగిసిన అనంతరం భారత్-ఎ , శ్రీలంక-ఎ జట్లు రెండు మల్టీ డే మ్యాచ్‌లు కూడా ఆడనున్నాయి. గాలెలో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక జట్టును త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

ముక్కోణపు సిరీస్‌కు భారత్-ఎ జట్టు

తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్