అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున, నాగచైతన్య సినిమాల గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. కానీ.. త్వరలోనే నాగ్, చైతూ కూడా అఫీషియల్ గా అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే… ఈ ఇయర్ అక్కినేని అభిమానులకు పండగే అనే మాట వినిపిస్తుంది. ఇంతకీ.. అక్కినేని హీరోల ప్లాన్ ఏంటి..?
ఈ సంవత్సరంలో.. ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో రూపొందుతోన్న లెనిన్ మూవీ ముందుగా మే 1న వస్తుందని ప్రకటించారు. ఆతర్వాత పెద్ది వలన పోస్ట్ పోన్ చేశారు. జూన్ 26న లెనిన్ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అఖిల్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలు విన్న వెంటనే నచ్చేలా ఉండడంతో విశేషంగా ఆకట్టుకుని.. యూట్యూబ్లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతున్నాయి. నాగార్జున ఈ మూవీ ఫస్ట్ కాపీ చూసి.. సినిమా అదిరింది.. కొత్త అఖిల్ ని చూస్తారు.. అంటూ ఫస్ట్ రివ్యూ ఇవ్వడంతో.. లెనిన్ పై మరింత క్రేజ్ ఏర్పడింది.
నాగచైతన్య నటిస్తున్న మూవీ వృషకర్మ. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే.. వేరే లెవల్లో ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో వృషకర్మ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో నాగచైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ షూట్ త్వరలో కంప్లీట్ చేసి దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం.
ఇక నాగార్జున కెరీర్లో మైలుస్టోన్ గా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా మూవీని నిర్మిస్తున్నారు. ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా చిత్రాల తర్వాత నాగార్జున, టబు కలిసి నటిస్తుండడం విశేషం. ఈ క్రేజీ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో నాగార్జునను సరికొత్తగా చూపించబోతున్నారని.. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని దసరాకి విడుదల చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. జూన్ 26న అఖిల్ లెనిన్ తర్వాత నాగచైతన్య వృషకర్మ వస్తుందా..? నాగార్జున 100వ సినిమా వస్తుందా..? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి ఈ ఇయర్ అక్కినేని అభిమానులకు పండగే అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి.. బాక్సాఫీస్ దగ్గర నాగ్, చైతూ, అఖిల్.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.


