రకుల్.. మరో రమ్యకృష్ణ కానుందా..?

కథానాయికలు.. కొన్నాళ్లు సక్సెస్ చూసిన తర్వాత.. కొత్తగా ట్రై చేయాలని రూటు మారుస్తుంటారు.. సీనియర్ హీరోయిన్స్ చాలా మంది అలా చేసిన వారే.. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రూటు మారుస్తుంది. దీంతో రకుల్ మరో రమ్యకృష్ణ కానుందా..? అనే మాటలు ఇండస్ట్రీ జనాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ.. రూటు మార్చి రమ్య ఏం చేసింది.. రకుల్ ఏం చేయబోతుంది..?

రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, నాన్నకు ప్రేమతో.. తదితర చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమధ్య టాలీవుడ్ పై కన్నా.. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ గ్లామర్ బ్యూటీ రూటు మార్చింది. గ్లామర్ రోల్స్ చేసే ఈ అమ్మడు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఫిక్స్ అయ్యింది. నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న శూర్పణఖ పాత్రలో కనిపించబోతుంది. ఇది రకుల్ కి ఓ ప్రయోగమే అని చెప్పచ్చు.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సీనియర్ నటి రమ్యకృష్ణలా రకుల్ ప్రయోగం చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో రమ్యకృష్ణ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసి నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహా మూవీలో రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్ లో ఎంత పవర్ ఫుల్ గా నటించిందో.. ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తుండడంతో రమ్యలా రకుల్ మెప్పించేనా అనేది ఆసక్తిగా మారింది.

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు చేయగలనని నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ పాత్ర కనుక క్లిక్ అయితే.. రకుల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోవడం ఖాయం. రామాయణ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించబోతుండగా, ఆయనకు సోదరిగా రకుల్ తన పెర్ఫార్మెన్స్‌తో పోటీ పడనుంది. శూర్పణఖ పాత్ర రామాయణంలో చాలా కీలకమైనది. ఒకరకంగా కథలో ఘర్షణ మొదలయ్యేది ఆమెతోనే. ఈ పాత్రతో రకుల్ మెప్పిస్తే.. మరిన్ని డిఫరెంట్ రోల్స్ లో నటించే ఆఫర్స్ వస్తాయి. మరి.. రకుల్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్