తన కుమారుడు బండి భగీరథ్ ను నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు. బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన స్పందించారు.
“నా కొడుకైనా చట్టం ముందు సమానమే. నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. నేను ఎప్పుడూ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. నా కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నాడు. మేము స్నేహితుల్లా ఉన్నాం కానీ ప్రజా జీవితంలో ఉన్న నేను అతనితో ఎక్కువ సమయం గడపలేకపోయాను.నా కొడుకును సమర్థించడం లేదు. కానీ అతనిని క్రిమినల్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య మానసిక క్షోభను ఎదుర్కొంటున్నాం. నేను ఏ సమస్యలైనా ఎదుర్కొంటాను. వెనక్కి తగ్గేది లేదు. చట్ట ప్రకారం ఏ చర్య తీసుకున్నా నేను గౌరవిస్తాను. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాం. నా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని వదిలేది లేదు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసిన వారిని ఎవరినీ వదలను.” అని బండి సంయ్ వ్యాఖ్యానించారు.


