విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు ట్విస్ట్ … బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యేకు నో

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ… ఆయన పార్టీ టీవీకేకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది.

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం — TVK పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి విశ్వాస పరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని మద్రాసు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా శ్రీనివాస సేతుపతి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి పెరియ కరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాల ప్రకారం:

శ్రీనివాస సేతుపతి — 83,375 ఓట్లు
పెరియ కరుప్పన్ — 83,374 ఓట్లు

దీంతో ఈ ఫలితం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.

అయితే ఈ ఫలితాన్ని సవాలు చేస్తూ డీఎంకే నేత పెరియ కరుప్పన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాట్లు జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ నియోజకవర్గంలో మళ్లీ ఓట్ల లెక్కింపు — రీకౌంటింగ్ నిర్వహించాలని కోర్టును కోరారు. అప్పటి వరకు శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా వ్యవహరించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు… తాత్కాలికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. విశ్వాస పరీక్ష సమయంలో శ్రీనివాస సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

ఈ పరిణామంతో ముఖ్యమంత్రి విజయ్ బలపరీక్షలో ఒక ఓటు తగ్గే పరిస్థితి ఏర్పడింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం విజయ్ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ సంఖ్య 119కి తగ్గనుంది.

అయితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి విజయ్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 మాత్రమే కావడంతో… ప్రస్తుతం సంఖ్యాబలం పరంగా ఆయనకు ఇబ్బంది ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మరోవైపు అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

Latest Articles

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్‌ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్