36.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం- కలెక్టర్లకు సీఎం రేవంత్‌ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్కతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితులు రాకూడదని… గన్ని బ్యాగులు, హమాలీలు, తూకం సిబ్బంది వంటి అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సీఎం సూచించారు. రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ కేంద్రాలకు సకాలంలో తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. లారీల కొరత వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఒప్పందం ప్రకారం సరిపడా లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు. అవసరమైతే అలాంటి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనకాడొద్దని స్పష్టం చేశారు.

ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా రవాణా శాఖ కమిషనర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గోదాముల కొరత ఉన్న నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లు వంటి ప్రదేశాలను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలని చెప్పారు. అక్కడ నిల్వ చేసిన ధాన్యాన్ని తర్వాత దశల వారీగా గోదాములకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రత్యేకంగా మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రైతులు తమ పంటను అమ్ముకునే విషయంలో ఎక్కడా ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుని కొనుగోలు కేంద్రాల్లో శాంతిభద్రతలు, రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.

ప్రతి జిల్లా కలెక్టర్ కొనుగోళ్ల పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి — సీఎస్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని… నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కలెక్టర్లపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

 

Latest Articles

విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు ట్విస్ట్ … బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యేకు నో

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ... ఆయన పార్టీ టీవీకేకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్