38.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

హనీ ట్రాప్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు

కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడు హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని లక్ష్యంగా చేసుకొని బ్లాక్‌మెయిల్ కుట్ర జరిగిందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఓ మహిళ తన కుమార్తెను అడ్డుపెట్టుకొని ముందుగా పరిచయం పెంచుకుని…తర్వాత అదే విషయాన్ని ఆధారంగా చేసుకొని కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. పోక్సో కేసు పెడతాం… మీడియాలో ప్రచారం చేస్తాం… అంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.

ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. తన నుంచి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు… సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ కేసును మరో దారికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బులు రాకపోవడంతో ఇప్పుడు మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం.

Latest Articles

యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ.. అబుధాబిలో మోదీ విమానానికి ఎఫ్‌-16లతో ఎస్కార్ట్‌

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ఆరు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చేరుకున్నారు. అబుధాబికి చేరుకున్న ప్రధాని మోదీ విమానానికి యూఏఈ ఎమిరేట్స్ అధికారులు ఎఫ్-16 యుద్ధ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్