తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు… గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైన పళనిస్వామి

తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి గవర్నర్‌ను కలిసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. పుదుచ్చేరి క్యాంప్‌ నుంచి చెన్నై రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు. రాత్రిక్యాంపులో పళనిస్వామి ఎమ్మెల్యేలను కలిశారు.గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరనున్నారు. అవసరమైన మద్దతు ఉందని అన్నాడీఎంకే అంటోంది. అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే రెడీ అవుతోంది. విజయ్‌కి ఎట్టిపరిస్థితుల్లో అధికారం దక్కకూడదని పంతం పట్టారు.పళనిస్వామి సీఎం అయినా పర్వాలేదని ఉదయనిధి స్టాలిన్‌ అంటున్నారు. హంగ్‌ ఫలితం వచ్చినప్పటి నుంచే డీఎంకే-అన్నాడీఎంకే మంతనాలు ప్రారంభించారు. తనకు డీఎంకే సపోర్టు చేస్తోందని పార్టీ ఎమ్మెల్యేలకు పళనిస్వామి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తానే సీఎం అవుతానని విజయ్‌వైపు వెళ్లొద్దని పళనిస్వామి చెప్పడంతో వేరు కుంపటికి సిద్ధమై మళ్లీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెనక్కితగ్గారు.

మరోవైపు విజయ్‌ సైతం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రెండు కలిస్తే రాజీనామాలకు సిద్ధమనే సంకేతాలు పంపించారు. 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని విజయ్‌ చెబుతున్నారు. ఇంకోవైపు 118 మార్క్‌ను చూపించే వారికే అవకాశం ఇస్తానని గవర్నర్‌ అర్లేకర్‌ అంటున్నారు.సరైన సంఖ్యాబలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా..సరే అని తమిళనాడు గవర్నర్‌ అర్లేకర్‌ ప్రకటించారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్