28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

సామ్.. బంగారం.. భయపడిందా..?

సమంత నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని మే 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు సామ్ బంగారం తన సినిమాని 15న రిలీజ్ చేయడం లేదు. ఈ క్రేజీ మూవీ ఊహించని విధంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఇంతకీ.. ఏమైంది..? బంగారం భయపడిందా..?

సమంత కొంత గ్యాప్ తర్వాత నటించిన మూవీ మా ఇంటి బంగారం. ఓ బేబీ అనే సక్సెస్ మూవీని ఇచ్చిన నందినీ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందడంతో మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇందులో సమంత ఇంత వరకు చేసిన పాత్రలకు భిన్నమైన పాత్ర పోషించడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో.. ఇక అనౌన్స్ చేసిన డేట్ కే బంగారం థియేటర్స్ లోకి వస్తుంది అనుకున్నారు. అయితే.. మే 15న రావాల్సినప్పటికీ ఈ మూవీ మేకర్స్ సడన్ గా సైలెంట్ అయ్యారు. కారణం ఏంటంటే.. కొత్త రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. జూన్ 19న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో సామ్ బంగారం.. భయపడిందా అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మే 14న సూర్య వీరభద్రుడు సినిమా తప్పితే మరే సినిమాలు లేవు.. కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. పైగా సమ్మర్ సీజన్. మరి.. మా ఇంటి బంగారం సినిమాను ఎందుకు పోస్ట్ పోన్ చేసారంటే.. ఐపీఎల్ తో క్లాష్ వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సినిమాలకు ఐపీఎల్ తో పెద్ద కష్టమే వచ్చింది. ఈవినింగ్ అయితే.. చాలు యూత్ అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక థియేటర్ల దగ్గర సందడే ఉండడం లేదు. అందుకనే కొత్త సినిమాలు వాయిదాపడుతున్నాయి.

మే 15న మా ఇంటి బంగారం చిత్రాన్ని రిలీజ్ చేయకూడదు.. పోస్ట్ పోన్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు జూన్ 4న వస్తుందని ప్రచారం జరిగింది. అయితే.. జూన్ 4న పెద్ది వస్తుండడంతో.. రెండు వారాల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమాని సమంత భర్త రాజ్ డికే నిర్మించారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. సామ్ సెకండ్ మ్యారేజ్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఇప్పటి వరుకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడు టైమ్ దొరికింది. దీంతో ఇప్పుడు జనాలకు రీచ్ అయ్యేలా మరింతగా ప్రమోషన్స్ చేసి.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడానికి ఛాన్స్ ఉంది. అయితే.. బంగారం భయపడిందా.. అనే కామెంట్లు వచ్చినప్పటికీ… సరైన డేట్ కోసం.. సక్సెస్ కోసం.. పోస్ట్ పోన్ చేయడంలో తప్పు లేదంటున్నారు సినీ అభిమానులు. మరి.. బంగారంకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే జూన్ 19 వరుకు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్