తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విజయ్‌కు గవర్నర్ నుంచి ఇప్పటివరకు అనుమతి లభించలేదు. విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
అయితే విజయ్ సమర్పించిన వివరాలపై గవర్నర్ పూర్తిగా సంతృప్తి చెందలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ నిరూపించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో రావాలని గవర్నర్ విజయ్‌కు సూచించినట్లు సమాచారం. పూర్తి స్థాయి మద్దతు పత్రాలు సమర్పించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. విజయ్ శిబిరం అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.


