35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

జక్కన్న టెన్షన్ పడుతున్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమాకైనా షూటింగ్ పూర్తైన తర్వాత పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేవారు. కానీ.. ఈసారి జక్కన్న రూటు మార్చారు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరో వైపు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా వారణాసి మూవీ రిలీజ్ కి సంవత్సరం టైమ్ ఉంది. అయినప్పటికీ.. జక్కన్న ఇప్పటి నుంచే విదేశాలల్లో ప్రమోషన్స్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. రాజమౌళి టెన్షన్ పడుతున్నారనే మాటలు సినీ జనాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ.. వారణాసి మూవీని ఇప్పుడు ఎక్కడ ప్రమోట్ చేయనున్నారు..? వారణాసి ఎంత వరు షూటింగ్ పూర్తి చేసుకుంది..? అసలు జక్కన్న ప్లాన్ ఏంటి..? నిజంగానే రాజమౌళి టెన్షన్ పడుతున్నారా..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే..

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న వారణాసి మూవీ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. ఇక అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అయితే.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తుందా అని సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తుండగానే జక్కన్న మరో వైపు ప్రమోషన్స్ చేస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే వారణాసి టీమ్ హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్ వ్యూలు ఇచ్చింది. అలాగే టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కు ఇంటర్నేషనల్ మీడియాను హైదరాబాద్ తీసుకువచ్చారు జక్కన్న.

​ఇటీవల మెక్సికోలో వారణాసి మూవీని ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్ లో వారణాసి మూవీని ప్రమోట్ చేయడానికి ప్లాన్ రెడీ చేసారట. ఈ విషయాన్ని కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. రాజమౌళి.. బాహుబలి మూవీతో బాలీవుడ్లో.. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వారణాసి మూవీతో అంతకు మించి చరిత్ర సృష్టించాలి అనుకుంటున్నారట. అందుకనే.. ఇప్పటి నుంచే ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తున్నారని టాక్.

అయితే.. ఈ సినిమా రిలీజ్ ఇంకా సంవత్సరం ఉండగా ప్రమోషన్స్ చేస్తుండడంతో జక్కన్న టెన్షన్ పడుతున్నారని.. అందుకనే విదేశాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. వారణాసి టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారని.. అనుకున్న టైమ్ కి.. అనుకున్న విధంగా వారణాసి రిలీజ్ అవుతుంది.. చరిత్ర సృష్టించడం ఖాయం. ఎలాంటి టెన్షన్ లేదు.. గట్టి నమ్మకంతో ఉన్నారని ఇన్ సైడ్ న్యూస్. మరి.. మహేష్‌, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్